శృంగార సంకీర్తన
రేకు: 23-3
సంపుటము: 5-128
రేకు: 23-3
సంపుటము: 5-128
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| అపురూపమైన మోము దాఁచి యిటువంటి- కపటపు నటనలు గడియించనేలే | ॥పల్లవి॥ |
| కిన్నెరకాయలఁ బోలు కిక్కిరిసినట్టి గుబ్బ- చన్నులపై ననుఁగొంగు జారఁగ కిన్నెర మీఁటుచు మంచి సన్నపు నడపుతో కన్నులు దేలఁగమేను కదలించేవేలే | ॥అపు॥ |
| వీడియు వీడనికొప్పు వేగన ముడుచుచు ఆడెడి బిత్తరిమాటలమరఁగా చూడనొప్పె నీ మంచి సుద్దులు చెప్పఁగనెంతే వాడక వాడుదురే వైతాళమేలే | ॥అపు॥ |
| చెక్కుటద్దములమీఁది చెమట చిత్తడితోడ సొక్కులు దేరఁగ మేను సుదతికి చిక్కించి నిన్నుఁగూడె శేషగిరీంద్రుఁడు నీ పయి మక్కువగలిగి కొంత మనసియ్యఁడేలే | ॥అపు॥ |


