శృంగార సంకీర్తన
రేకు: 23-5
సంపుటము: 5-130
రేకు: 23-5
సంపుటము: 5-130
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| లలితలావణ్య విలాసముతోడ నెలఁత ధన్యత గలిగె నేఁటితోడ | ॥పల్లవి॥ |
| కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ తొప్పఁదోగేటి చెమటతోడ అప్పుడటు శశిరేఖలైన చనుఁగనతోడ దప్పిదేరేటి మోముఁదమ్మితోడ | ॥లలిత॥ |
| కులుకుఁ గబరీభరము కుంతలంబులతోడ తొలఁగఁ దోయని ప్రేమతోడ మొలకనవ్వులు దొలఁకు ముద్దుఁజూపులతోడ పులకలు పొడవైన పొలుపుతోడ | ॥లలిత॥ |
| తిరువేంకటాచలాధిపుని మన్ననతోడ సరిలేని దివ్యవాసనలతోడ పరికించరాని అరవిరిభావముతోడ సిరి దొలఁకెడి చిన్నిసిగ్గుతోడ | ॥లలిత॥ |


