శృంగార సంకీర్తన
రేకు: 26-3
సంపుటము: 5-146
రేకు: 26-3
సంపుటము: 5-146
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| సింగారరాయనిఁ దిట్టీఁ జెంచెత వేలి- వుంగరాలచేత నన్నొత్తకు నీవనుచు | ॥పల్లవి॥ |
| గురువింద పొదమరఁగున నుండి బిగిసీని సిరివరు నెదుటనే చెంచెత దొరలకే కాక నెత్తురుమన్ను మాకేల బురదచెమటనామై పొలకంపనుచు | ॥సింగా॥ |
| గుదిగొన్న మొగలిరేకుల యెన్ను కొనగోరఁ జిదిమి దేవునివేసీఁ జెంచెత గదరుఁ బిల్లుల నేతికంపు నీ వొళ్ళెల్ల కదియకు నా మేను కంటగించీననుచు | ॥సింగా॥ |
| కప్పురపుఁ దావి వేంకటపతికౌఁగిటఁ జెప్పక యేతులే చెప్పీఁ జెంచెత దప్పిదేరు తేనెల తనివార నీమోవి యెప్పుడుఁ బాయక ఇట్టె ఇచ్చేవో యనుచు | ॥సింగా॥ |


