శృంగార సంకీర్తన
రేకు: 27-1
సంపుటము: 5-150
రేకు: 27-1
సంపుటము: 5-150
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| కొంచెము మాకులము గుణము చంచలము చెంచెతతో నీకు నేల చెప్పవయ్య చలము | ॥పల్లవి॥ |
| గదరుఁ గస్తూరిమన్ను కమ్మనిమై పూఁత చెదరిని పట్టునార చీరపాఁత పదిలమైన పండు ఫలము మామేఁత ఇదివో నే మెవ్వరికి నేలయ్య రోఁత | ॥కొంచె॥ |
| గుబ్బలపై వెడజారు గురుగింజ పేరు సిబ్బపుఁ జెక్కుల నవ్వుచిక్కుఁ జీరు మబ్బు మబ్బు నెరుల దిమ్మరి కొప్పుతీరు గబ్బిచూపు కన్నుల మాకడనేల నోరు | ॥కొంచె॥ |
| అడవి లేఁతచిగురదివో మాపరపు వెడ వెడ నగనే మావింత వొరపు యెడయక తిరువేంకటేశ మాపై వెరపు గొడవకూటమి నిన్నుఁ గూడిన మైమరపు | ॥కొంచె॥ |


