శృంగార సంకీర్తన
రేకు: 27-2
సంపుటము: 5-151
రేకు: 27-2
సంపుటము: 5-151
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి, ఏకతాళి
| తక్కులచేఁతల మాయదారివట బొంకు- నిక్కములు సేయనేమి నేరవా యీ నీవు | ॥పల్లవి॥ |
| గుట్టున నూఁదిన పిల్లఁగోవి నీ రవమున వట్టిమాఁకుల నిగురు వెట్టీనట పట్టినఁ గందెడి నామై పై పులకలిగురు - వెట్టఁగా నన్నింత సేయ బెట్ట యీ నీకు | ॥తక్కు॥ |
| పాదముచెమటనీరు పరపి దురితముల సేదదేర నిందరిని జేసీనట మేదినీధరుఁడ నీ మేని చెమటలతావి- నాదరించి ననుఁగాచుటరుదా యీ నీకు | ॥తక్కు॥ |
| అల నీమదిఁబుట్టిన అంగజుఁడు లోకులను చెలరేఁగి కాఁపురాలు సేయించీనట కలసి వేంకటేశ్వర కందువరతుల నన్ను కలకాలమునేలుట ఘనమా యీ నీకు | ॥తుక్కు॥ |


