శృంగార సంకీర్తన
రేకు: 27-5
సంపుటము: 5-154
రేకు: 27-5
సంపుటము: 5-154
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| తలపట్టు వెట్టుకొన్న తరుణీమణి నిన్ను నలసి వేమరు దూరు నాకె వో యీకె | ॥పల్లవి॥ |
| గొప్పలయిన గుబ్బలవేఁగుల నలయు సతులు కొప్పులు జారఁగఁ దన్నుఁ గొలిచి రాఁగా చెప్పరాని నటనల సింగారపుఁ దోఁటలోన అప్పుడు నిన్నుఁ జూచిన ఆకెవో యీకె | ॥తల॥ |
| పాదపుఁబెండేలు మ్రోయఁ బడఁతులిరువంకల సేదలు దేరుచుఁ దనచెంగట రాఁగా మేదకపు తొలుకరి మెఱుఁగంటా నీ పప్పు- డాదిగొని చూచిన ఆకెవో యీకె | ॥తల॥ |
| బంగారు చెరఁగుచీర పయ్యెదకొంగు దూలఁగా అంగన వొకతె దనకాకు చుట్టీఁగా ఇంగితమెఱిఁగి వేంకటేశుఁడ నిన్నుఁ గలసి అంగడినెల్లఁ బెట్టిన ఆకెవో యీకె | ॥తల॥ |


