శృంగార సంకీర్తన
రేకు: 28-3
సంపుటము: 5-158
రేకు: 28-3
సంపుటము: 5-158
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| వంచన ప్రియములవారే కాక నించిన కన్నీటి నేనేల నీకు | ॥పల్లవి॥ |
| గిలుకు మట్టెలతోడ కిందిచూపులతోడ సెలవి నవ్వులు నీ పైఁ జిందఁగాను వలతువుగాక యెవ్వతి కైనఁ జిత్తము నిలుపఁగనోపని నేనేల నీకు | ॥వంచన॥ |
| గోడచాట్లతోడ కోనచీఁకటితోడ వాడల నెలయించువారేకాక వాడుచు లేమావి వడచల్ల వెడమాయ- నీడలనెండే నేనేల నీకు | ॥వంచన॥ |
| జగడంబులతోడ సణఁగు సొలపుతోడ వగ నిన్ను భ్రమయించువారె కాక దిగులులేక నిన్ను తిరువేంకటేశుఁడ నెగులెఱుఁగక కూడు నేనేల నీకు | ॥వంచన॥ |


