శృంగార సంకీర్తన
రేకు: 28-5
సంపుటము: 5-160
రేకు: 28-5
సంపుటము: 5-160
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| అలమేలుమంగ నీవభినవరూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా | ॥పల్లవి॥ |
| గరుడాచలాధీశు ఘన వక్షమున నుండి పరమానందం సంభరితవై నెరతనములు చూపి నిరంతరము నాథుని హరుషించఁగఁ జేసితి గదమ్మా | ॥అల॥ |
| శశికిరణములకు చలువల చూపులు విశదముగా మీఁద వెదచల్లుచు రసికత పెంపునఁ గరఁగించి యెప్పుడు నీ- వశము చేసుకొంటి వల్లభునోయమ్మా | ॥అల॥ |
| రట్టడి శ్రీ వేంకటరాయనికి నీవు పట్టపురాణివై పరఁగుచు వట్టిమాఁకులిగిరించు వలపుమాటల విభు జట్టిగొని వురమున సతమైతివమ్మా | ॥అల॥ |


