శృంగార సంకీర్తన
రేకు: 28-6
సంపుటము: 5-161
రేకు: 28-6
సంపుటము: 5-161
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశాక్షి
| ఒడయఁడవు నినుఁ బాసియుండ వశమా తరుణి చిడుముడి యలుక చేతిచిలుకఁ బగచేసె | ॥పల్లవి॥ |
| గారవపు జలరాశికన్య నీతోనలిగి ఆరామములలోన నలయఁగాను వైరంపుబాణమై వనజమిరుమై గాఁడె ఈ రీతి నీ యలుక యిల్లు పగఁజేసె | ॥ఒడ॥ |
| ఎలజవ్వనిటు నీకు నెదురుచూచుచు వెడలి చెలఁగి వెన్నెలకు విచ్చేయఁగాను నలువొందఁ జంద్రకిరణములు మయివడిఁ బొక్కె బులుపుఁ గోపము తోడఁబుట్టుఁ బగచేసె | ॥ఒడ॥ |
| పంతంపు శ్రీసతికిఁ బతివి వేంకటరమణ కాంతహృదయంబెఱిఁగి కలయఁగాను అంతలోననె మదనుఁడలయించె నిప్పుడిటు కొంతవడి నీకసరు కొడుకుఁ బగచేసె | ॥ఒడ॥ |


