శృంగార సంకీర్తన
రేకు: 29-1
సంపుటము: 5-162
రేకు: 29-1
సంపుటము: 5-162
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఎన్ని సేఁతలై నఁ జేయునిపుడు యీతఁడు కన్నెవయసువారినెల్ల గాఁకదేర్చె నీతఁడు | ॥పల్లవి॥ |
| గుబ్బచన్నుదోయి మెఱుఁగుఁ గులుకరించి చెలఁగి నడచు గబ్బుతావిరమణి చల్లకడవతోడను సిబ్బమైన చెక్కులందు చిన్నిచెమటగారఁ జెనకి గబ్బిసేఁతలెల్లఁ జేసె కళలుగరఁగ నీతఁడు | ॥ఎన్ని॥ |
| వాలుఁగన్నుదోయి మెఱుఁగు వల్లెవేసివేసి రతికి కాలుదవ్వురమణి చల్లకడవతోడను కేలుదమ్మి కంకణాలు గిలుకరించి చెలఁగి నడచు కీలుగొప్పు సడిలి జారఁ గిందుపరిచె నీతఁడు | ॥ఎన్ని॥ |
| కొదలుదేరు కోవిలెలుఁగు కుత్తికందు సాళగించి కదలుమోవిరమణి చల్లకడవతోడను ఎదురమెరయు వేంకటేశుఁడింతి ప్రేమదీరఁ జెనకి కదిసి మదనకదనమందు కలికిఁజేసె నీతఁడు | ॥ఎన్ని॥ |


