శృంగార సంకీర్తన
రేకు: 29-2
సంపుటము: 5-163
రేకు: 29-2
సంపుటము: 5-163
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| ఏలే యేలే మరఁదలా చాలుఁ జాలు చాలును చాలు నీతోడి సరసంబు బావ | ॥పల్లవి॥ |
| గాఁటపు గుబ్బలు గదలఁగఁ గులికేవు మాటలఁ దేటల మరఁదలా చీటికి మాటికిఁ జెనకేవే వట్టి- బూటకాలు మాని పోవే బావ | ॥ఏలే॥ |
| అందిందె నన్ను నదలించి వేసేవు మందమేలపు మరఁదలా సందుకోఁ దిరిగేవు సటకారి వోబావ పొందు గాదిఁకఁ బోవే బావ | ॥ఏలే॥ |
| చొక్కపు గిలిగింత చూపుల నన్ను మక్కువ నేసిన మరఁదలా గక్కున నను వేంకటపతి కూడితి దక్కించుకొంటివి తగులైతి బావ | ॥ఏలే॥ |


