శృంగార సంకీర్తన
రేకు: 30-2
సంపుటము: 5-168
రేకు: 30-2
సంపుటము: 5-168
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| సారెసారె విన్నవించఁ జాలమిఁక నీవు దారిదప్పఁ దిరిగేవు తగవా వోరి | ॥పల్లవి॥ |
| చెప్పరాదు కడు వలచిన వానివలె నా- కొప్పులోని సవరము కొంటఁబోయి అప్పుడే వొక్కతికిచ్చితట వోరి నా- తప్పుగాని నీవల్లఁ దప్పులేదు వోరి | ॥సారె॥ |
| కడలేని మోహంబు గలవానివలె నా- కడితాను చీర నీవు కాసెవోసి వడిగా నేఁగెదవు యవ్వతికియ్యవలెనో నన్ను వడిఁబెట్టి యింతసేయవలెనా వోరి | ॥సాలె॥ |
| ముద్దుల నా వేలనున్న ముద్దుటుంగరము నీవు వుద్దండానఁ గొంటఁబోతి వోరి తిద్దలేము నీగుణాలు తిరువేంకటేశ నీవు వొద్దికతో నన్నుఁబాయకుండరా వోరి | ॥సాలె॥ |


