శృంగార సంకీర్తన
రేకు: 30-3
సంపుటము: 5-169
రేకు: 30-3
సంపుటము: 5-169
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| తలనొక్క మాటాడఁ దలకెక్కె వలపు దీని- తలఁపు రేఁచక మీరు తలరమ్మా | ॥పల్లవి॥ |
| చిత్తజు నమ్ములు దాఁకి జీర వారినందుకు పూ- వత్తులు వేయక కాని వాడదమ్మా బత్తిగల వారిందరు పచ్చకప్పురము మేన మెత్తకకాని మానదు మెత్తరమ్మా | ॥తల॥ |
| కంటిచూపు కాయజుని వింటిబాణములు దాఁకి గంటిలేని పోటులాయఁ గదరమ్మా అంట ముట్టరాని తాప మగ్గలమైనది ముల్లు ముంటఁగాని పోదు మేను మూయరమ్మా | ॥తల॥ |
| అప్పుడింత సొబగు లేదతివమొగమునందు చొప్పులెల్ల బాగులాయ చూడరమ్మా అప్పుడు శేషాద్రిరాయఁడంగనఁ గలిసెఁ గాన యెప్పుడూఁ బాయని చనవిచ్చె నమ్మా | ॥తల॥ |


