శృంగార సంకీర్తన
రేకు: 31-2
సంపుటము: 5-174
రేకు: 31-2
సంపుటము: 5-174
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| వెక్కసమగుఁ గుచవిభవములు జక్కవా(వ?) పులుగుల జగడములే | ॥పల్లవి॥ |
| చింతచేత నిదె చెలియ నుదిటిపై చెంతలఁ జెదరిన చిరునెరులు కాంత కన్నులను గండుమీలకును కంతుఁడు వేసిన గాలములే | ॥వెక్క॥ |
| తమకంబునఁ గాంతకుఁ గరమూలపు- చెమటల తావుల చెలువములు మమతలఁ బెంచిన మరుని కొంతముల- జమళితీఁగెలకు జలకములే | ॥వెక్క॥ |
| తెఱమోవిపై తిరువేంకటపతి గుఱుతులు సేసిన కురుఁబసలు ఒఱగి వివశతల నుండఁగ సురతపు మఱపులు దెలిపిన మర్మములే | ॥వెక్క॥ |


