శృంగార సంకీర్తన
రేకు: 61-1
సంపుటము: 5-175
రేకు: 61-1
సంపుటము: 5-175
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కొండమలహరి
| భోగీంద్రశయనుని బోయతి దివ్య- భోగాలు మరిగిన బోయతి | ॥పల్లవి॥ |
| పొదిగొన్న పెనుఁగొప్పు బోయతి మించుఁ- బొదలిన గుబ్బల బోయతి పొదలఁ బూవులు చూచి బోయతి యంప- పొది సవి వెరచెనె బోయతి | ॥భోగీ॥ |
| పొడల గందపుమేని బోయతి పచ్చి- పొడికప్పురపు బూఁత బోయతి పొడవైన హరిఁ జూచి బోయతి నేఁడు పుడుకు వేఁదురుగొన్న బోయతి | ॥భోగీ॥ |
| పొందైన రచనల బోయతి పతిఁ బొందక పొందిన బోయతి పొందులెరఁగని బోయతి రతిఁ బొందె వేంకటపతి బోయతి | ॥భోగీ॥ |


