శృంగార సంకీర్తన
రేకు: 62-2
సంపుటము: 5-182
రేకు: 62-2
సంపుటము: 5-182
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| శిఱుత నవ్వులవాఁడు శిన్నెకా వీఁడు వెఱపెఱఁగడు సూడవే సిన్నెకా | ॥పల్లవి॥ |
| పొలసుమేనివాఁడు బోరవీఁపువాఁడు సెలసు మోరవాఁడు సిన్నెకా గొలసుల వంకల కోరలతో బూమి వెలసినాఁడు సూడవే సిన్నెకా | ॥శిఱుత॥ |
| మేఁటి కుఱుచవాఁడు మెడమీఁది గొడ్డలి- సీటకాలవాఁడు సిన్నెకా ఆఁటదానిఁ బాసి అడవిలో రాకాశి- వేఁటలాడీఁ జూడవే సిన్నెకా | ॥శిఱుత॥ |
| బింకపుమోఁతల పిల్లఁగోవివాఁడు సింక సూపులవాఁడు సిన్నెకా కొంకక కలికియై కొసరి కూడె నన్ను వేంకటేశుఁడు సూడవే సిన్నెకా | ॥శిఱుత॥ |


