శృంగార సంకీర్తన
రేకు: 62-3
సంపుటము: 5-183
రేకు: 62-3
సంపుటము: 5-183
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| చెల్లఁబో అలుగ నేఁడు సిగ్గుగాదా వొల్లని వీనిఁ బాసి వుడికీ నామనసు | ॥పల్లవి॥ |
| పొలసి యీ ప్రాణమిట్టే పోయినాఁ బోయఁ గాక తలవంపు సేసే యీ తను వేఁటికే కలసియుఁ గలయని కఠిచిత్తుని వీని సొలసి కమ్మరఁ జూచీ నా మనసు | ॥చెల్ల॥ |
| మరుతాపమున మేను మాఁడిన మాఁడెఁగాక పరులబారికిఁ జిక్కే బ్రదుకేఁటికే విరహన నొకతెవై వేదనఁ బొరలు వీని- కరుణలే కోరీని కష్టపు నామనసు | ॥చెల్ల॥ |
| సడిఁబెట్టి వయసిట్టే చంపినఁ జంపెఁ గాక వడిఁ బెట్టి వేఁచే నావయసేఁటికే కడు జాణఁడైన వేంకటగిరీంద్రుఁడు వాని- వొడలు సోఁకిన నిట్టే వుబ్బెడి నామనసు | ॥చెల్ల॥ |


