శృంగార సంకీర్తన
రేకు: 62-4
సంపుటము: 5-184
రేకు: 62-4
సంపుటము: 5-184
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంభోది
| ఇదె మొగంబిదె యద్దమిఁకనేఁటికే మిగులఁ బదరేవు చెలివద్ద బవళించి నీవు | ॥పల్లవి॥ |
| పెట్టినది నాయకుని బిరుదు పెనుఁబెండెంబు కట్టినది యతనిమెడ కంటమాల యెట్టు బొంకెదవె చెలి యిందాఁక బంగారు- పట్టేమంచముమీఁదఁ బవళించి నీవు | ॥ఇదె॥ |
| పుక్కిటిది నాయకుని పొందైన తమ్ములము చెక్కిటిది పతినొసలి చిన్నిచెమట యిక్కు వెరిఁగియు బొంకనిఁకనేలె చెలి యతని- పక్కనే యిందాఁకఁ బవళించి నీవు | ॥ఇదె॥ |
| బచ్చెనలు కుచయుగముపై నతని మృగమదము లచ్చెనలు కొనగోళ్ళలాంచనములు ఇచ్చకునిఁ దిరువేంకటేశుఁ గూడితివె చెలి పచ్చలోవరి లోనఁ బవళించి నీవు | ॥ఇదె॥ |


