శృంగార సంకీర్తన
రేకు: 63-5
సంపుటము: 5-191
రేకు: 63-5
సంపుటము: 5-191
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| చలిగాలి వేఁడేల చల్లీనె కప్పురపు- మలయజము తానేల మండీనే | ॥పల్లవి॥ |
| పాపంపు మనసేల పారీనే నలుగడల చూపేల నలువంకఁ జూచీనే తాపంపుమేనేల తడవీనె పూవింటి- తూపేల చిత్తంబు దూరీనే | ॥చలి॥ |
| వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు కోయిలలు దామేల గొణఁగీనే రాయడికి నలులేల రాసీనె మాతోను కాయజుఁడు తానేల కసరీనే | ॥చలి॥ |
| ఏకాంతముననేల యెదురైతినే తనకు లోకాధిపతికేల లోనైతినే చేకొనిదె మన్నించె శేషాద్రివల్లభుఁడు పైకొనిదె మమ్మేల పాలించెనే | ॥చలి॥ |


