శృంగార సంకీర్తన
రేకు: 64-1
సంపుటము: 5-193
రేకు: 64-1
సంపుటము: 5-193
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| నాకుఁ జెప్పరె వలపు నలుపో తెలుపో నూకి పోవఁగరాదు నుయ్యా కొండో | ॥పల్లవి॥ |
| పొలఁతి మరునికి వెరవ పులియా యెలువో వులుకుఁదుమ్మిదమోఁత వురుమో మెరుమో తిలకింపఁ జందనము తేలో పామో యెలమిఁ గోవిలకూఁత యేదో పోదో | ॥నాకు॥ |
| పొదలిన చలిగాలి పొగయో వగయో వదలిన కన్నీరు వాఁగో వంతో వుదరమునఁ బన్నీరు వుడుకో మిడుకో యెదుటఁ దలవంచుకొనుటెగ్గో సిగ్గో | ॥నాకు॥ |
| అసమశరుపై పరపుటదనో పదనో పసగలవానిమోవి పంచదారో తేనో అసమగతి వానిరాక ఆదోపాదో రసికు వేంకటేశు పొందు రాజ్యమో లక్ష్మో | ॥నాకు॥ |


