శృంగార సంకీర్తన
రేకు: 64-5
సంపుటము: 5-197
రేకు: 64-5
సంపుటము: 5-197
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| బయ లీఁదించేవే గొల్లపడుచా - నీవె బయ లీఁదించేవు లోపలనె కన్నులను | ॥పల్లవి॥ |
| పాలు వోయవుగా గొల్లపడుచా-యీ- పాలుకుండలివి లోలోపల నున్నవి పాలుమాలేవేలే గొల్ల పడుచా- మా- పాలు నీ కేలయ్య పాలవారివాఁడవు | ॥బయ॥ |
| పచ్చితేనె దేవే గొల్లపడుచ- మాకు పచ్చితేనె లేదు మావిపంటనే కాని పచ్చిమాటలేలే గొల్లపడుచ- పూవుఁ- బచ్చితేనెలివివో నీ పలుకుల కొనలు | ॥బయ॥ |
| పసిచల్లమ్మే గొల్లపడుచా- నీవె పసివడి తిరిగేవు బడివాయక పసిబాలవటె గొల్లపడుచా- కురుఁ- బల వేంకటగిరిపతి నన్నేలితివి | ॥బయ॥ |


