శృంగార సంకీర్తన
రేకు: 64-6
సంపుటము: 5-198
రేకు: 64-6
సంపుటము: 5-198
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| ఇందూ నందును రుచులెట్లుండునో కందువెరిఁగి మేలు కైకొందువు | ॥పల్లవి॥ |
| పదివేలు పళ్యాల పళ్ళిభోగము నీఁ వదన నారగింతువప్పాలతో పొదవిన యింతేసి పొందైన మతితో నీ- సుదతికెమ్మోవినే చొక్కితివిగా | ॥ఇంద॥ |
| సరిలేని కల్పభూజముల పూవుల పూజ సిరులుగా సురలచేఁ జేకొందువు పరిపరివిధముల పరిమళములనెడి- తరుణి పువ్వులతావిఁ దగిలితిగా | ॥ఇంద॥ |
| కొత్తయిన కస్తూరితోఁ గోరి తట్టుపుణుఁగు మెత్తుకొందువు నీవు మేనిండను ఇత్తరిఁ దిరువేంకటేశ యీ చెలిఁగూడి హత్తిన చెమటలతో నలరితిగా | ॥ఇంద॥ |


