శృంగార సంకీర్తన
రేకు: 65-3
సంపుటము: 5-201
రేకు: 65-3
సంపుటము: 5-201
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| వనితలఁ గరఁగించు వన్నెకాఁడవు యిట్టె తనివి దీరవేమిటఁ దగునయ్య విట్ఠల | ॥పల్లవి॥ |
| పైపైనె యేరమణిగుబ్బలతో యిచ్చితివి నీ- వైపైన కరముల వాఁడిగోళ్ళు దూపిలిన రతితోడఁ దోయఁ డు చేతులతోడ యేపుననున్నాఁడవిపుడేమయ్య విట్ఠల | ॥వనిత॥ |
| పొందైన యేలలన చూపులకొ యిచ్చితివి నీ- విందైన మురిపెపు వేయిగన్నులు అందపు రెండుగన్నులరవిరి నీ మోమున చెందమ్మి రేకులఁ బోలుఁ జెల్లునయ్య విట్ఠల | ॥వనిత॥ |
| కింకల నేసతికో చిక్కెను నీచిత్తమెల్లను అంకెల నన్ను నేలితివబ్బురంబుగా పంకంపుఁ గస్తూరిమేన పండరంగిపతివైన- వేంకటనగముమీఁది వెడమాయ విట్ఠల | ॥వనిత॥ |


