శృంగార సంకీర్తన
రేకు: 66-2
సంపుటము: 5-206
రేకు: 66-2
సంపుటము: 5-206
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| రాఁడుగాక సరుగన రసికుఁడు యిట్టే నేఁడే మచ్చికలనే నిధులు నిలుపఁడా | ॥పల్లవి॥ |
| ప్రేమపు నీ యధరమే పెట్టరానిజీతము కోమలి నీ తమ్ములమే కొంగుభత్యము జాము నిన్నుఁ గొలిచిన చక్కని నీ విభుఁడు యేమరక వలపులయేకరాజ్యమేలఁడా | ॥రాఁడు॥ |
| పూఁత నీ గర్వముల చూపులే వారకములు లేఁత నీ నగవులే పళ్ళెములో కూడు పూఁతగాని చిత్తమనే వుప్పరిగెనుండినా బాఁతి పడి నీ గుబ్బలపైఁడి కుండలెత్తఁడా | ॥రాఁడు॥ |
| పుయ్యని నీ మేనితావి పువ్వుల చప్పరము తొయ్యలి నీ కౌఁగిలిది తూఁగుమంచము కయ్యపుఁ గూటముల వేంకటగిరివిభుఁడు గయ్యాళి నీ కోరికల గద్దెమీఁద నుండఁడా | ॥రాఁడు॥ |


