Display:
శృంగార సంకీర్తన
రేకు: 66-3
సంపుటము: 5-207
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఇందరినేలితి విఁకనేలే (మే?) నీ-
యందపు బనులకు నంపుదు గాక
॥పల్లవి॥
పొక్కుచు నిదె వలపుల సింహసన-
మెక్కితి వంగన యిఁకనేమే
పుక్కిటి నిట్టూర్పుల ప్రసాదములు
చక్కని చెలులకుఁ జల్లుదు గాక
॥ఇంద॥
పరిమళపు నుదుటఁ బట్టునఁ బట్టము
ఇరువుగఁ గట్టితివిఁకనేమే
తరగని మేని ప్రతాపానలమున
అరుదగు సిగ్గుల నణఁతువు గాక
॥ఇంద॥
రాఁపుల మోహపురతుల రాజ్యమిది
యేపునఁ జేసితివిఁకనేమే
పైపై వేంకటపతిరూప సిరులు
చేపడె నిన్నిటఁ జెలఁగుదు గాక
॥ఇంద॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము