శృంగార సంకీర్తన
రేకు: 66-4
సంపుటము: 5-208
రేకు: 66-4
సంపుటము: 5-208
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| వెరవకువే యింత వెరగేలా నీకు నెఱిఁ గురిసీఁ గొప్పున నీలాలు | ॥పల్లవి॥ |
| పగడాలు వాతెరఁ బాయక కురియఁగ మొగిఁ గురిసీఁ గన్నుల ముత్యాలు మగువ నీవిభుని ప్రేమపుఁగూటమి గన్నుల మగుడఁ గురిసీ నింక మాణికాలు | ॥పర॥ |
| పడఁతి నీపుట్టానఁ బచ్చలు గురియఁగా వడిసీని నీమేన వజ్రాలు కడఁగి నీరమణుని కాఁకలఁ గూడఁగ తొడరీ నీగోళ్ళతుదఁ గెంపులు | ॥పర॥ |
| హితవైన తిరువేంకటేశుకౌఁగిట మోహ- రతులఁ బొడమె నవరత్నాలు ప్రతలేని లప్పలైన పచ్చి కస్తూరి శయ్య మితిలేక రాలెనే గోమేధికాలు | ॥పర॥ |


