శృంగార సంకీర్తన
రేకు: 66-6
సంపుటము: 5-210
రేకు: 66-6
సంపుటము: 5-210
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
| నీవు దురగముమీఁద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదచల్లితపుడు | ॥పల్లవి॥ |
| పదిలముగ నిరువంక పసిఁడిపింజల యంప- పొదుల తరకసములొరపులు నెరపఁగ గదయు శంఖంబుఁ జక్రము ధను:ఖడ్గములు పదివేలు సూర్యబింబములైనవపుడు | ॥నీవు॥ |
| సొరిది శేషుని పెద్దచుట్టు పెనుఁ గేవడము సిరిదొలఁక నొకచేతఁ జిత్తగించి దురమునకుఁ దొడవైన ధూమకేతువు చేత- నిరవైన బల్లెమై యేచెనందపుడు | ॥నీవు॥ |
| కరకజడతో రమాకాంత జయలక్ష్మీయై తొరలి కౌఁగిట నిన్నుఁ దొడికి పట్టి చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని మెరుఁగు కుచకుంభముల మిసిమితో నపుడు | ॥నీవు॥ |


