శృంగార సంకీర్తన
రేకు: 67-4
సంపుటము: 5-214
రేకు: 67-4
సంపుటము: 5-214
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| కొలనిలోన మును గోపికలు మొలక నవ్వు(వు?)లతో మొక్కిరి నీకు | ॥పల్లవి॥ |
| పిరుఁదులు దాఁటిన పించెపుటలకల తురుములు వీడఁగఁ దొయ్యలులు అరిదినితంబములందునె దాఁచుక మురిపెపుఁ గరముల మొక్కిరి నీకు | ॥కొలని॥ |
| నిద్దపు మానము నెలఁతలు లోఁగుచు గద్దరి తొడలనె కట్టచును ముద్దుటుంగరంబుల కరములతో ముద్దులు గునియుచు మొక్కిరి నీకు | ॥కొలని॥ |
| పాలిండ్ల పెనుభారంబుల కర- మూలపు మెఱుఁగులు ముంచఁగను వేలపుఁ బ్రియముల వేంకటేశ నిను మూలకుఁ బిలుచుచు మొక్కిరి నీకు | ॥కొలని॥ |


