శృంగార సంకీర్తన
రేకు: 67-5
సంపుటము: 5-215
రేకు: 67-5
సంపుటము: 5-215
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| మానరె మాయలు మగువలు నేఁ గాను కాననుచుఁ గనలీ శిశువు | ॥పల్లవి॥ |
| పాలట దొంగిలె బాలుఁడు గో- పాలులఁ గూడుక పలుమరును పోలవీమాఁటలు బొంకులు యిది యేలె యేలె మీరెలజవ్వనులు | ॥మానరె॥ |
| సారెకు వెన్నలు చవులట యీ- దూరులు మీకిఁక దొసగులు చేరువ గరిమలు చెల్లవు మీరు పోరె పోరె వొరపుల నెర సతులు | ॥మానరె॥ |
| కింకలు మీకివి గెలుపులు నెల- వంకలు మీకివి వన్నెలు వేంకటపతి మీ విభుఁడట మీరు బొంకక బొంకక పొలఁతులు మనరే | ॥మానరె॥ |


