శృంగార సంకీర్తన
రేకు: 68-1
సంపుటము: 5-217
రేకు: 68-1
సంపుటము: 5-217
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| వేఁటకాఁడనంటా నా వెంటఁ బాయవు వోరి చీటకపు చెంచెత నాచేతి లాగెరఁగవా | ॥పల్లవి॥ |
| పొదలో నేనేసిన పులి నీవేసితినని పెదపెద్ద యెలుగుఁల బెదరించేవు కుదురుగుబ్బల నిన్నుఁ గుమ్ముదునో వుండేవో మేను చిదియఁగా మేటిచెంచెత నన్నెఱఁగవా | ॥వేఁట॥ |
| చేరువ నామోఁటునఁ జేరిన నామెకముల నేరుపరినంటా నీవునేసేవు జీరలుగా కొమ్ము గోరఁ జింతుతో వూరకుండేవో పేరుకల చెంచెత నాబిరుదులెరఁగవా | ॥వేఁట॥ |
| చొల్లెపు చుట్టలతోడ చూపులకు నడ్డాలు చెల్లునంటా వచ్చి చెట్టవట్టేవు నొల్లననఁగా గూడేవు వుద్దండపు వేంకటేశ జల్లివింటి చెంచెత నాచలములెరఁగవా | ॥వేఁట॥ |


