శృంగార సంకీర్తన
రేకు: 68-5
సంపుటము: 5-221
రేకు: 68-5
సంపుటము: 5-221
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| పలుకుఁదేనియల నుపారమియ్యవే అలరువాసనల నీ యధరబింబానకు | ॥పల్లవి॥ |
| పుక్కిటి లేనగవు పొంగుఁబాలు చూపవే చక్కని నీవదనంపు చందమామకు అక్కరొ నీవాలుఁగన్నులా రతిగా నెత్తవే గక్కన నీచెక్కుతొలుకరి మెరుపులకు | ॥పలుకు॥ |
| కమ్మని నీమేని తావి కానుకగా నియ్యవే వుమ్మగింత చల్లెడి నీవూరుపులకు చిమ్ముల నీచెమటలఁ జేయవే మజ్జనము దిమ్మరి నీమురిపెవు తీగమేనికి | ॥పలుకు॥ |
| పతి వేంకటేశుఁ గూడి పరవశమియ్యవే యితవైన నీమంచి హృదయానకు అతనినే తలఁచఁగ నానతియ్యఁ గదవె తతితోడ నీలోని తలపోఁతలకు | ॥పలుకు॥ |


