శృంగార సంకీర్తన
రేకు: 68-6
సంపుటము: 5-222
రేకు: 68-6
సంపుటము: 5-222
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| ఆన వెట్టుదువు నీవప్పటి నా నోరణఁచి వోరి నీ నిజానకు నాతో నేఁడైన మానరా | ॥పల్లవి॥ |
| పచ్చడాన జవ్వాది పరిమళమేడదిరా పచ్చిసేఁతలు చెక్కిళ్ళపై నీకేడవిరా గచ్చు మోవిమీఁదనున్న కసిగాటులేడవిరా యిచ్చకుఁడ కనుఁగెంపులేడవి గలిగెరా | ॥ఆన॥ |
| ముద్దుల చక్కని నీదు మోముకళలేడవిరా కొద్దిగాని సందొత్తుగోరేడదిరా గద్దరీఁడ యీ చిట్లు గందము నీకేడదిరా తిద్దెను గస్తూరిబొట్టు దిమ్మరి యెవ్వతెరా | ॥ఆన॥ |
| భీతితో నీవాడేటి తబ్బిబ్బుమాటలేడవిరా రాతిరేడ నుండితి వెరవక చెప్పరా యేతరీఁడ తిరువేంకటేశ నన్ను నేలితివి యేతులతో వలపించ నెంత కలికివిరా | ॥ఆన॥ |


