శృంగార సంకీర్తన
రేకు: 69-3
సంపుటము: 5-225
రేకు: 69-3
సంపుటము: 5-225
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| కవయఁగవలెనంటి కాఁగలించేవా నీ- వువిదలఁ దలఁచక వుండనోపేవా | ॥పల్లవి॥ |
| పారిటాకులు గట్టి పారనోపేవా యేరులెల్ల దాఁటి కొండలెక్కనోపేవా యీరీతి వెదురుబియ్యమేరనోపేవా పేరినతేనెలు తెచ్చి పెట్టనోపేవా | ॥కవ॥ |
| యెడమఁ గుడిని వింటనేయనోపేవా అడవిమెకాల వేఁటలాడనోపేవా కడఁగి చెంచెత నాతోఁ గలశుండేవా అడరి నాపొత్తుల నారగించేవా | ॥కవ॥ |
| యిప్పటి మాఁటలు యీడేరించనోపేవా చెప్పినట్టే కాఁపురము సేయనోపేవా కప్పిరంపుశయ్యపై వేంకటరాయఁడా యెప్పుడుఁ బాయని చనవియ్యనోపేవా | ॥కవ॥ |


