శృంగార సంకీర్తన
రేకు: 69-4
సంపుటము: 5-226
రేకు: 69-4
సంపుటము: 5-226
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
| చూడవమ్మ యశోదమ్మ వాడల వాడల వరదలివిగో | ॥పల్లవి॥ |
| పొంచి పులివాలుఁ బెరుగు మించు మించు మీఁగడలు వంచి వారలుపట్టిన కంచపుటుట్ల కాఁగులివిగో | ॥చూడ॥ |
| పేరీఁ బేరని నేతులు చూరలు వెన్నల జున్నులును ఆరగించి యట సగఁబాళ్ళు పారవేసిన బానలివిగో | ॥చూడ॥ |
| తెల్లని కనుఁదీగెల సోగల చల్లలమ్మేటి జవ్వనుల చెల్లినట్లనే శ్రీవేంకటపతి కొల్లలాడిన గురుతులివిగో | ॥చూడ॥ |


