శృంగార సంకీర్తన
రేకు: 72-1
సంపుటము: 5-241
రేకు: 72-1
సంపుటము: 5-241
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| పుడమిలోన మగలు గలుగు పొలఁతులకును దిరుగఁబాసె అడవివారి నుండనియ్యఁడమ్మ నీ కొమారుఁడు | ॥పల్లవి॥ |
| భారమైన కుచభరంబుపై చెరంగు జారనొకతె జారుఁజూపులాఁడి మంచిసాళగంపుటెలుఁగున కోరో చల్లయనుచు మెరుఁగుగుచములదర మెట్టినడవ గోరుదీసి పారితెంచె కొమ్మ నీ కుమారుఁడు | ॥పడమి॥ |
| నెరులు దొంగలించినట్టి నీలవేణి యొకతె పెద్ద తురుము దురిమి చల్లకడవతో విలాసమమరఁగా చెరఁగుదూల వాఁడిగోళ్ళ చేయివీచి పిలిచి గోప- తరుఁణిఁ గొంగువట్టి తీసె తల్లి నీ కుమారుఁడు | ॥పడమి॥ |
| కంచుమట్టియల రవంబు గజబజింపఁ బదము దా- టించి గబ్బినడపు నడచు మించుగుబ్బలాఁడిని ఇంచుకంతవాఁడు వేంకటేశుఁడంటఁబట్టి కౌఁగిఁ లించి మోవి గంటిసేసె నిపుడు నీకుమారుఁడు | ॥పడమి॥ |


