శృంగార సంకీర్తన
రేకు: 72-2
సంపుటము: 5-242
రేకు: 72-2
సంపుటము: 5-242
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| కొలమున మొదలనె గొల్లవారము యీ- చలమునఁ బగ నిన్ను సాదించ నేరుతుమా | ॥పల్లవి॥ |
| బూతులఁ దిట్టుచు సొలపులఁ జూచేవు మేనిఁ నేతులకంపుల నేము నీ కేలరా యేతులు రేఁపుచు మమ్మునెలయించేవు యేర మాతోనే యింతేసి నేము మాటలు నేరుతుమా | ॥కొల॥ |
| కన్నుల నద్దలింపుచు గయ్యాళించేవు వోరి నిన్ను మెప్పించఁ గలేము నేమేలరా వెన్నలుఁ బాలునమ్మేటి వెఱ్ఱివారము యీ- కిన్నెర మీట్ల గిలిగించఁగ నేరుతుమా | ॥కొల॥ |
| చేరి నన్నుఁ బోనీనని చేయివట్టేవు యేమీ నేరనివారము నీకు నేమేలరా గారవపు తిరువేంకటగిరివిభుఁడ యీ కూరిమినిట్టే నిన్నుఁ గూడఁగ నేరుతుమా | ॥కొల॥ |


