శృంగార సంకీర్తన
రేకు: 72-3
సంపుటము: 5-243
రేకు: 72-3
సంపుటము: 5-243
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఊరకుంటే నన్ను నుండనియ్యవు ఇంత పేరుకుచ్చి తిట్ట నన్నుఁ బ్రియమా నీకు | ॥పల్లవి॥ |
| బుజముపైఁ జేయి వేసి బుజ్జగించేవు ఇంత- నిజమా నామీఁద నీ కరుణ భజన మొరయ నన్నుఁ బచ్చి సేసేవు ఇంత- గజరుఁజేఁతలకోపఁగలనా యిఁకను | ॥ఊర॥ |
| కాలుమీఁదఁ గాలువేసి కరఁగించేవు యింత- మేలా నాతోడి సమేళములు వాలుకచూపుల నాకు వాఁడివెట్టేవు యింత- యేలికవై యిటుసేయనేలా యిపుడు | ॥ఊర॥ |
| చక్కఁదనమిది నాది జట్టిసేసేవు నా చెక్కుల రేకలు వ్రాయఁ జిత్తగించేవు చక్కని వేంకటగిరిస్వామీ నీవు యిట్టే దక్కిన నన్నింత సేయఁ దగునా యిఁకను | ॥ఊర॥ |


