శృంగార సంకీర్తన
రేకు: 73-5
సంపుటము: 5-251
రేకు: 73-5
సంపుటము: 5-251
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| వద్దు మమ్మింత నెవ్వగల నలయించ??? నిటు పొద్దువొద్దునకు నోపుదుమా వోరి | ॥పల్లవి॥ |
| బీరమున నిన్ను వలపించుకొన నేమంత- వారమా వట్టిగరువములు గాక నేరుపే కలిగినను నీచేఁతలకు నింత దూరుచును కాఁకఁ గందుదుమా వోరి | ॥వద్దు॥ |
| కన్నులనె వలపు చిలుకఁగఁ జూడ నేమంత- కున్నారమా నీవుదుటు గాక వన్నెలను నిన్ను నేవలపింతునైన నీ- వున్నవిధమిటు చూడనోర్తుమా వోరి | ॥వద్దు॥ |
| నీ నేరములు దక్కె నీకు నినుఁ బాయఁగల- నైన నేనిట్టవుదు నటరా కోనేటిరాయ తక్కులుమాని మచ్చికల- నూని నాకౌఁగిటనె వుండరా వోరి | ॥వద్దు॥ |


