శృంగార సంకీర్తన
రేకు: 74-5
సంపుటము: 5-257
రేకు: 74-5
సంపుటము: 5-257
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| కలిమి నిందరిని దగ్గరుకొరకే - వీఁడె సులభుఁడై తిరిగీని చూడరమ్మా | ॥పల్లవి॥ |
| భంగపెట్టి గొల్లవారి పాలువెన్నలు దొంగిలించు కొరకే తోవలనెల్లా చెంగలించి చేతులెత్తి చెలఁగుచును- వీఁడె దొంగి దొంగి తిరిగీని తోలరమ్మా | ॥కలిమి॥ |
| గుట్టుదీర రేపల్లెకొమ్మలనెల్లా రట్టుసేయుకొరకే రచ్చలనెల్ల గట్టిగాఁ జాటెడి మొలగంటలతోడ- వీఁడె చుట్టపుబాలునివలెఁ జూడరమ్మా | ॥కలిమి॥ |
| చెప్పరాని తనమాయచేత నిందరినిఁ గప్పెడికొరకే వేంకటవిభుఁడు కప్పెడి నల్లనియలకలనుదురు-వీఁడె గుప్పెడి ముద్దులు యెత్తుకొనరమ్మా | ॥కలిమి॥ |


