శృంగార సంకీర్తన
రేకు: 74-6
సంపుటము: 5-258
రేకు: 74-6
సంపుటము: 5-258
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| వలతునందువు నాకు వడినెప్పుడును నేఁ- డెలమి నొకచో భావ మెట్లుండె నీకు | ॥పల్లవి॥ |
| బరువైన మదనతాపంబునకు వెరవకిటు పురవేదనలను నేఁబొరలఁగాను సరసమున నీవచట సతులకౌఁగిటనుండి యిరవుకొననపుడు మనసెట్టుండె నీకు | ॥వలతు॥ |
| వదలిన తురుముతోడ వాడువదనముతోడ వొదిగినేనిటు చింతనుండఁ గాను సదమదముగాఁగ నొకసతిని గౌఁగిటి రతుల- గదియంగఁ జిత్తమేగతి నుండె నీకు | ॥వలతు॥ |
| జమలి మొలనూళ్ళతో జవ్వాదిమేనితో నమరి యీరీతి నేనలరఁగాను కొమరొందఁ గూడితివి కోనేటిరాయ నీ- తమకమెందాఁక నెంతటినుండి నీకు | ॥వలతు॥ |


