శృంగార సంకీర్తన
రేకు: 75-3
సంపుటము: 5-261
రేకు: 75-3
సంపుటము: 5-261
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| చెలువపు సేఁతల శిన్నెకా పెద్ద వలపువేదనల వాడీనయ్యో | ॥పల్లవి॥ |
| మొగమునకెగరెడి మొనవాఁడి గుబ్బల- చిగురుఁబెదవులాఁడి శిన్నెకా నిగినిగ మెరిచేటి నీలిమేనివానిఁ- సొగసు చూచి వాని సొలశీనయ్యో | ॥చెలు॥ |
| మొగ్గల మొలకల మురిపెపుఁ గన్నుల- శిగ్గుల చిరునవ్వు శిన్నెకా ఉగ్గున రేపల్లె వుసురు గొనేటివాని దగ్గరి తమకానఁ దడవీనయో | ॥చెలు॥ |
| చంకల బంగారు చల్లిన మెఱుఁగుల చింకబెదరులాఁడి శిన్నెకా వేంకటపతిఁ గూడి వేడుక తోడుత సుంకుల సోగల సొలశీనయ్యో | ॥చెలు॥ |


