శృంగార సంకీర్తన
రేకు: 75-5
సంపుటము: 5-263
రేకు: 75-5
సంపుటము: 5-263
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఎందాఁకా జాగిది యేలే - తన- అందము లచటనె అయ్యీఁ గాక | ॥పల్లవి॥ |
| మృగమదమీతఁడు మెత్తీనిదె మై ధగధగమనఁగాఁ దనకేలే మగువకుచముల చెమట నంటిన యా- పొగరుఁ బరిమళమె పూసీఁ గాక | ॥ఏందాఁ॥ |
| బెడిదపుఁ దురుమిదె పెట్టీనీతఁడు తడవుగ నలరులు తనకేలే పడఁతి శిరసునను పైపైఁ జెరిగిన- జడివాన విరులు జారీఁ గాక | ॥ఏందాఁ॥ |
| చిమ్ముచు వీడెము సేసీనీతఁడు తమ్ములముమియఁడు తనకేలే కొమ్మ వీడెమిఁక కోనేటప్పఁడు తమ్మివదనమున దాఁచీఁ గాక | ॥ఏందాఁ॥ |


