శృంగార సంకీర్తన
రేకు: 75-6
సంపుటము: 5-264
రేకు: 75-6
సంపుటము: 5-264
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| బిగ్గెఁ గాఁగలించుకోవే పిరితీయక నిగ్గుల యాతనిమేను నేఁడే నొచ్చీనా | ॥పల్లవి॥ |
| మందరమెత్తినవాఁడు మల్లుల మొత్తినవాఁడు అందపు నీ గుబ్బల వేఁగాన లేఁడా గొందినున్న కుచములు కొనవాండ్లైతేను చెందిన యాతనిమేను చిల్లులయ్యీనా | ॥బిగ్గె॥ |
| భూమెల్ల మోఁచినవాఁడు పొడవు దాఁచినవాఁడు భామ నీ మొలనూలు భారమనీనా వోమక యాతనితోడి వుపరిసురతానకు యేమని వేఁడుకొనిన యేల లోఁగేవే | ॥బిగ్గె॥ |
| వేంకటనగమువాఁడు వెన్నెలమొగమువాఁడు కింకల నీ చేఁతలకుఁ గిందుపడీనా పంకజవదన నీకుఁ బాయలేక చెనకిన కుంకుమగుబ్బల చెనకులకోపఁడా | ॥బిగ్గె॥ |


