శృంగార సంకీర్తన
రేకు: 76-5
సంపుటము: 5-269
రేకు: 76-5
సంపుటము: 5-269
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| భావమెరఁగని పడుచా వోసి పోవే పోవే పోవే పడుచా | ॥పల్లవి॥ |
| మొరఁగు మరఁగు వింత కరఁగుదేనెల- పరచుమాటల పడుచా చురుకు మెరుపు వాలుఁజూపుల కన్నుల కెరలఁ బొడిచి గిలిగించేవే పడుచా | ॥భావ॥ |
| కెలపు మలపుఁ బయిఁడి గిలుకుల మట్టెల- బలుపుమోఁతల పడుచా అలపు సొలపు ముద్దులొలుకు నవ్వుల జలుకువలపు మీఁదఁ జల్లేవే పడుచా | ॥భావ॥ |
| వెదకి వెదకి తిరువేంకటేశ్వరుఁ బదరి కూడిన పడుచా కదలు గుబ్బల కలికిచేఁతల వుదుటు నడపులనె వొరగేవే పడుచా | ॥భావ॥ |


