Display:
శృంగార సంకీర్తన
రేకు: 77-5
సంపుటము: 5-275
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
పొద్దువోకలివి నీకు భువిలో నెన్నఁగ నీ-
సుద్దులు చెప్పెదమన్న చూడఁజూడఁ గొత్తలు
॥పల్లవి॥
మోఁతనీటిలోని యీఁత మూఁపునఁ బుట్టిన మేఁత
మూఁతిమీఁది కత్తికోఁత మొనగోరివాఁత
బాఁతిలేని దారవోఁత పాపముచూడనిచేఁత
నాఁతిమీఁది తలపోఁత నాఁగేటిగీఁత
॥పొద్దు॥
వలపు చల్లినలాగు వాజినెక్కినబాగు
వలసి నొల్లములైన వలవనిజాగు
తెలిసితిమిదెనేఁడు తిరువేంకటేశ్వర
తలఁపు ప్రాణులమీఁద- దగులుటేలాగు
॥పొద్దు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము