Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 4-5
సంపుటము: 1-25
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
నిత్యానంద [1]ధరణీధర ధరారమణ
కాత్యాయనీస్తోత్రకామ కమలాక్ష
॥నిత్యానంద॥
అరవిందనాభ జగదాధార భవదూర
పురుషోత్తమ నమో భువనేశ
కరుణాసమగ్ర రాక్షసలోకసంహార-
కరణ కమలాధీశ కరిరాజవరద
॥నిత్యానంద॥
భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద
సాగరనిజావాస సకలాధిప
నాగారిగమన నానావర్ణనిజదేహ
భాగీరథీజనక పరమ పరమాత్మ
॥నిత్యానంద॥
పావన పరాత్పర శుభప్రద పరాతీత
కైవల్యకాంతశృంగారరమణ
శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో
దేవతారాధ్య సుస్థిరకృపాభరణ
॥నిత్యానంద॥

[1] ‘ధరణి’ అని పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము