శృంగార సంకీర్తన
రేకు: 78-2
సంపుటము: 5-278
రేకు: 78-2
సంపుటము: 5-278
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఇట్టే నామదిఁ గోపమెచ్చరించేవు వట్టి వలపే నాపై వారించవలెనా | ॥పల్లవి॥ |
| మోహపు సంకుటుంగరముల వెలిగోర నా- దేహముపై నునురేక దియ్యఁజూచేవు సాహసివిరా వోరి వెచ్చపు నీవలపులోని- దాహమెల్లా నాతోనే యింతటఁ జూపవలెనా | ॥ఇట్టే॥ |
| తళుకుబంగారంచుల దట్టి చీరకొంగుఁ లలర నీమేను నాపైనప్పళించేవు వలదు వోరి వెచ్చపువలపు నీదెల్లాను పలుమారునిట్ల నాపైఁ బూయవల నా | ॥ఇట్టే॥ |
| సన్నపుమణుల కుప్పెనసవరము కొప్పు నా- కన్నులు దాఁకఁగ నాపైఁ గడు వీఁగేవు కన్నుల కలికి వేంకటరాయ నీకౌఁగిటి వన్నెలెల్ల నాపై నిటువలెఁ జేయవలెనా | ॥ఇట్టే॥ |


