Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 41-6
సంపుటము: 1-254
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
లేదు బ్రహ్మవిద్యామహాసుఖము తమ
కీడు తమకర్మ మేమి సేయఁగవచ్చు
॥లేదు॥
నానావిధులఁ బొరలి నరుఁడు దానై వివిధ-
మైన కర్మములే అనుభవించి
లేని లంపటములకు లోనై దురితా-
ధీనులై క్రమ్మరఁ దిరిగిపోవుటేకాని
॥లేదు॥
పరగ నిన్నిటఁ బొడమి బ్రాహ్మణుఁడై
సరిలేని వేదశాస్త్రములు చదివి
అరుదయిన కాంక్షచే నతిపాపపరులై
వెరవునఁ బొడవెక్కి విరుగఁబడుటేకాని
॥లేదు॥
చేరని పదార్థములే చేరఁగోరుటగాని
చేరువనే యామేలు సిద్ధింపదు
ధీరులై తమలోనఁ దిరువేంకటేశ్వరునిఁ
గోరి యిటు భజియింపఁ గూడు టెన్నఁడుగాని
॥లేదు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము