Display:
శృంగార సంకీర్తన
రేకు: 85-2
సంపుటము: 5-321
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఏలే పడుసా యేదేని గుడుసా
చాలు నేఁపకువే జవ్వనంపు గడుసా
॥పల్లవి॥
వద్దేలే కసరు వలనని కిసరు
పొద్దువొద్దులకుఁ జూపుల యసరు
పెద్దైన వలపుల పిసరు లోన-
న్నద్దేవు నేనైతినసురుసురు
॥ఏలే॥
వచ్చేనేననవే నా వలపు చేకొనవే
మచ్చుచల్లక నామాట వినవే
ఇచ్చేననవే నీహృదయమింతటనైన
రిచ్చపడిన నాకూరిమి గనుఁగొనవే
॥ఏలే॥
రావే సంగడికి రతుల యంగడికి
శ్రీ వేంకటేశుఁడ నా చెంగటికిని
నీవే కౌఁగిటికి నిధులలోఁగిటికి
మోవీవే వెరవక మోహపుటాఁకటికి
॥ఏలే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము