శృంగార సంకీర్తన
రేకు: 85-4
సంపుటము: 5-323
రేకు: 85-4
సంపుటము: 5-323
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| చూపులనే సొలసేవు చూడరాదా మమ్ముఁ గాపురము సేయనీక కారించేవా | ॥పల్లవి॥ |
| వదినెంటాఁ బిలిచేవు వద్దు సుమ్మీ యెవ్వరోయి వదినెలు నీకు వాడవారి మరఁది యెదురైతే మొక్కేవు యేఁటికోయి యింతేసి వుదుటులు మాని చక్కనుండనేరవా | ॥చూపు॥ |
| అత్తనంటాఁ బిలిచేవు అక్కడ నిక్కడ నీకు అత్తలెవ్వరోయి వూరఁ బొత్తులల్లుఁడా వత్తునంటాఁ జెప్పంపేవు వడదాఁకి కూకులును వత్తులునై పోదుఁగాని వచ్చి చూడరాదా | ॥చూపు॥ |
| చీర వెలిగా నవ్వేవు చెల్లఁబో యెక్కడనైన మారుజాతి వారికైన మానములేదా తీరు నీకు నింతేసి తిరువేంకటేశుఁడ కూరిమి యెరిఁగి నన్నుఁ గూడితివౌరా | ॥చూపు॥ |


